ఏపీ భవన్‌ను పేల్చేస్తామంటూ బెదిరింపులు

ఢిల్లీలోని ఏపీ భవన్‌ను పేల్చేస్తామంటూ వచ్చిన మెయిల్ కలకలం సృష్టించింది. ఈ ఘటనతో అప్రమత్తమైన ఏపీ భవన్ అధికారులు, ఢిల్లీ పోలీసులు, బాంబ్ డిటెక్షన్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో కలిసి విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. చివరకు ఈ బెదిరింపు మెయిల్‌ను పోలీసులు ఫేక్‌గా గుర్తించారు.