సూర్యాపేట జాగృతి అధ్యక్షురాలుగా కృష్ణవేణి

SRPT: తెలంగాణ జాగృతి సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలిగా పట్టణానికి చెందిన సూరారపు కృష్ణవేణి నియమితులయ్యారు. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత గురువారం మధ్యాహ్నం ఈ నియామకాన్ని ప్రకటించారు. తనకు ఈ అవకాశం కల్పించిన కవితకు కృష్ణవేణి కృతజ్ఞతలు తెలిపారు. సూర్యాపేట జిల్లాలో ప్రజా సమస్యలపై పోరాడుతానని, అప్పగించిన బాధ్యతలను సమర్థవంతగా నిర్వహిస్తానని అన్నారు.