VIDEO: కేసరి సముద్రం చెరువును పరిశీలించిన కలెక్టర్

VIDEO: కేసరి సముద్రం చెరువును పరిశీలించిన కలెక్టర్

నాగర్ కర్నూల్: పట్టణంలోని కేసరి సముద్రం చెరువును జిల్లా కలెక్టర్ బదవత్ సంతోష్ సోమవారం పరిశీలించారు. గత రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు ఉపొంగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. కేసరి సముద్రం చెరువు అలుగు ఉదృతంగా ప్రవహిస్తున్నందున ప్రజలు దాటే ప్రయత్నం చేయొద్దని అన్నారు. పోలీసులు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు.