రేషన్ సరుకుల పంపిణీ తీరును పరిశీలించిన: జాయింట్ కలెక్టర్

VSP: జి.మాడుగుల పంచాయతీ బూసిపల్లి గ్రామంలో రేషన్ సరుకుల పంపిణీ తీరును జాయింట్ కలెక్టర్ భావన వశిష్ట సోమవారం పరిశీలించారు. ఈ మేరకు రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్న వాహనం వద్దకు వెళ్లి పంపిణీ తీరిన పరిశీలించారు. అదేవిధంగా సరుకులు తీసుకోవడానికి వచ్చిన లబ్ధిదారులతో ఆమె మాట్లాడారు. సరుకుల పంపిణీలో ఏమాత్రం అలసత్వం వహించిన చర్యలు తప్పవని జేసీ భావన హెచ్చరించారు.