VIDEO: అందులో నేను అన్‌ఫిట్ కావచ్చు: హరీష్ రావు
HYD: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. రాజకీయాల్లో నోరు పారేసుకుంటే మొదటికే మోసం వస్తుందన్నారు. సచివాలయంలో ఆర్థిక మంత్రి ఛాంబర్ ఎదుట కాంట్రాక్టర్లు ధర్నాలు చేయడం చరిత్రలో ఎన్నడైనా ఉందా? అని ప్రశ్నించారు. మీలాగా బిల్లులు చెల్లించడానికి 20%-30% కమిషన్ తీసుకోలేదు, అందులో నేను అన్‌ఫిట్ కావచ్చన్నారు.