బిక్కవోలు రైల్వే గేట్ వద్ద రైలు ఢీకొని మృతి
E.G: బిక్కవోలు జయప్రద రైల్వే గేట్ వద్ద గుర్తు తెలియని వ్యక్తిని రైలు ఢీకొట్టడంతో మంగళవారం మృతి చెందాడు. సామర్లకోట GRP పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడి వయసు సుమారు 40 సంవత్సరాలు ఉంటుందన్నారు. అతని ఒంటిపై గోల్డ్ కలర్ షర్టు, నలుపు రంగు ఫ్యాంటు ఉన్నాయి. మృతదేహం సమీపంలో అతనికి చెందిన బైక్ లభ్యమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.