రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు

SKLM: పలాస నుంచి ఇచ్చాపురం వైపు బైక్‌పై వెళ్తున్న బీటెక్ విద్యార్థి బురద అజిత్, మదనాపురం హైవే జంక్షన్ వద్ద ఆగి ఉన్న ఆయిల్ ట్యాంకర్‌ను బలంగా ఢీకొన్నాడు. ఈ ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, చికిత్స నిమిత్తం హరిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.