'పాఠశాలల్లో ఉపాధ్యాయులను నియమించాలి'
GDWL: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందని, వెంటనే ఉపాధ్యాయులను, విద్యా వాలంటీర్లను నియమించాలని బీఆర్‌ఎస్‌వీ జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య డిమాండ్ చేశారు. మంగళవారం గద్వాల జిల్లా కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయంలో డీఈవోకు ఆయన ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్నారు.