'స్వాతంత్య్రాన్ని సాధించిన మహనీయుడు గాంధీజీ'
GNTR: సత్యం, అహింస అనే ఆయుధాలతో స్వాతంత్య్రాన్ని సాధించిన మహనీయుడు, జాతిపిత మహాత్మా గాంధీజీ అని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఇవాళ పొన్నూరు అంబేద్కర్ సెంటర్‌లోని గుంటూరు బస్ స్టాప్ వద్ద గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ ఆశయాలు ప్రతి తరానికి అనుసరణీయమని ఆయన పేర్కొన్నారు.