ఉగ్రదాడికి నిరసనగా వైసీపీ కొవ్వొత్తుల ర్యాలీ

ఉగ్రదాడికి నిరసనగా వైసీపీ కొవ్వొత్తుల ర్యాలీ

కోనసీమ: వైసీపీ ఆధ్వర్యంలో జమ్ము కశ్మీర్‌‌లోని పహల్‌గామ్‌‌లో జరిగిన ఉగ్రదాడిలో అసువులు బాసిన వారికి నివాళులు అర్పిస్తూ ఆదివారం రాత్రి అమలాపురం హైస్కూల్ సెంటర్ నుంచి గడియార స్తంభం సెంటర్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంఛార్జ్ డా. పినిపే శ్రీకాంత్ పాల్గొని ఉగ్రవాదం నశించాలి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.