ఆలయంలో చోరీపై ఎమ్మెల్యే పరిశీలన
NDL: ఓర్వకల్లు మండలంలోని బుగ్గ రామేశ్వర స్వామి దేవాలయంలో 9.5 కేజీల వెండి ఆభరణాల చోరీ ఘటనపై ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి బుధవారం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. దొంగలను త్వరగా పట్టుకుని ఆభరణాలను రికవరీ చేయాలని పోలీసులను ఆదేశించారు. ప్రముఖ పుణ్యక్షేత్ర భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారులకు సూచించారు.