'ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'
PPM: రానున్న రోజుల్లో జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున, అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. వడగాలుల ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని ఆయన సూచించారు. ద్రవ పదార్థాలను అధికంగా తీసుకోవాలని అయన కోరారు.