విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి
NGKL: కల్వకుర్తి మండలం ఎల్లికల్ గ్రామంలో శనివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ప్రవీణ్ ఇంటి వద్ద నీళ్లు కొడుతుండగా విద్యుత్ షాక్ తగిలి కుప్పకూలాడు. వెంటనే స్థానికులు అతనిని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ప్రవీణ్ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.