సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

సూర్యాపేట: తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలో రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి గురువారం పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రెడ్డి జాగృతి జిల్లా నాయకులు కుంచాల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వల్ల పేద రెడ్డి విద్యార్థులకు, కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.