మోదీతో రక్షణశాఖ కార్యదర్శి భేటీ

మోదీతో రక్షణశాఖ కార్యదర్శి భేటీ

ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రక్షణశాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ ప్రధానితో భేటీ అయ్యారు. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌తో ఉద్రిక్తతలు, సరిహద్దు భద్రత, రక్షణ రంగంపై ఇరువురు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.