VIDEO: నా సొంత ఊరి వాళ్లే నా గుండెల మీద కొట్టారు: MLA
MBNR: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. రంగారెడ్డిగూడ తన సొంత ఊరని, గ్రామ అభివృద్ధి కోసం కోటి యాభై లక్షల రూపాయలు మంజూరు చేసినప్పటికీ, జీపీ ఎన్నికల్లో అదే ఊరి ప్రజలు తనను ఓడించారని వాపోయారు. నా సొంత ఊరి వాళ్లే నన్ను ఓడించి నా గుండె మీద కొట్టారన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఎమ్మెల్యే మద్దతు ఉన్న అభ్యర్థి ఓటమి పాలైన విషయం తెలిసిందే.