ఈనెల 6న మెగా జాబ్ మేళా

ఈనెల 6న మెగా జాబ్ మేళా

SKLM: నిరుద్యోగ యువతకు ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పించేందుకు ఈనెల 6న శ్రీకాకుళంలో భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కొత్తలంక సుధ బుధవారం తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో ఉదయం 10 గంటల నుంచి ఈ ఎంపికలు ప్రారంభమవుతాయన్నారు. పదో తరగతి, ఇంటర్, ఏదైనా డిగ్రీతో పాటు బి.ఎస్సీ/ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ) అభ్యర్థులు అర్హులన్నారు.