VIDEO: సోసైటీ అవకతవకలపై విచారణ.. సీఈవోపై రైతుల ఆగ్రహం
MDK: చిన్నశంకరంపేట మండలం చందంపేట రైతు సహకార సంఘం అవకతవకలపై విచారణ చేపట్టిన అధికారి తుకారామ్ పీఏసీఎస్ సీఈవో పాషాపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు చెల్లించినప్పటికీ రశీదులు ఇవ్వకుండా అవకతవకలకు పాల్పడిన సీఈవోపై రైతుల ఫిర్యాదులు వెల్లువెత్తాయి. రశీదుల వివరాల అడిగిన తప్పించుకుని తిరుగుతున్నారని వారు మండిపడ్డారు.