పెనుకొండలో ఘనంగా 753వ గంధ మహోత్సవం

పెనుకొండలో ఘనంగా 753వ గంధ మహోత్సవం

SS: పెనుకొండలో శ్రీ బాబాఫకృద్దీన్ స్వామి వారి 753వ గంధ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం రాత్రి దీపాలు జరిగాయి. కోరికలు నెరవేరిన భక్తులు కొబ్బరి కాల్చి తమ మొక్కుబడి చెల్లించుకున్నారు. దేశ నలమూలల నుండి భారీ సంఖ్యలో భక్తులు ఈ వేడుకలకు విచ్చేశారు. దర్గాకు వచ్చే భక్తులకు పీఠాధిపతి సలావుద్దీన్ బాబా అన్ని ఏర్పాట్లు చేశారు.