స్లాటర్ హౌస్‌ను పరిశీలించిన GHMC కమిషనర్

స్లాటర్ హౌస్‌ను పరిశీలించిన GHMC కమిషనర్

HYD: గౌలిపుర డివిజన్‌లో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న స్లాటర్ హౌస్‌ను బుధవారం జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. అలాగే ఈ ప్రాంతంలో అక్రమంగా నిర్మిస్తున్న భవనాలపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గౌలిపుర కార్పొరేటర్ ఆలే భాగ్యలక్ష్మి, కటిక సంఘం సభ్యులు, బస్తీ వాసులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.