రద్దీ కొనసాగుతున్న నల్లబెల్లి అంగడి సంత
WGL: నల్లబెల్లి సద్దుల పండుగ సందర్భంగా నల్లబెల్లి అంగడి రోడ్డుకి ఇరువైపులా జనసంచారం కిక్కిరిసిపోయింది. పండుగకు కావలసిన పూలు, పళ్ళు, కూరగాయలు, వస్త్రాలు కొనుగోలు చేసేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు. అంగడి రోడ్డంతా కొనుగోలు దారులతో కిటకిటలాడుతుండగా, ట్రాఫిక్ రద్దీ కారణంగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.