'ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి'
MNCL: ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ పురోగతి సాధించేలా ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు. ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియలో పురోగతి సాధించాలని, BLOలు మ్యాపింగ్ త్వరగా పూర్తి చేయాలన్నారు.