బస్సును ఢీకోన్న ఆటో .. డ్రైవర్‌కు తీవ్ర గాయలు

KKD: ముమ్మిడివరం మండలం అనాతవరం ప్రధాన కూడలిలో గురువారం ఉదయం ఆర్టీసీ బస్సును ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి, చికిత్స కోసం అమలాపురం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో ఆటో ముందు భాగం దెబ్బతింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.