కస్తూర్బా గాంధీలో విద్యార్థినులపై ఎలుకల దాడి

KNR: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలోని కేశవపట్నం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఘటన చోటుచేసుకుంది. రాత్రి పడుకున్న తర్వాత ఒక్కసారిగా ఎలుకలు వచ్చి కరిచి గాయపరిచాయని విద్యార్థినులు తెలిపారు. 10 మంది విద్యార్థినులకు తీవ్రగాయాలు అయ్యాయని విద్యార్థులు పేర్కొన్నారు. దీంతో గుట్టుచప్పుడు కాకుండా స్థానిక PHCలో ఉపాధ్యాయులు చికిత్స అందించారు.