అన్న క్యాంటీన్‌ను సందర్శించిన టీడీపీ నేత
AKP: ఎలమంచిలి పట్టణం అన్న క్యాంటీన్‌ను మంగళవారం నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు సందర్శించారు. ఈ సందర్భంగా భోజన సౌకర్యంపై ఆరా తీశారు. ఎలమంచిలి నియోజకవర్గంలో మరో అన్న క్యాంటీన్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఐదు రూపాయలకే పేద ప్రజలకు భోజన సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.