'ఈనెల 15లోగా దరఖాస్తు చేసుకోవాలి'

AKP: పదవ తరగతి, ఇంటర్ ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు ఈనెల 15వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి డీఈవో అప్పారావు నాయుడు తెలిపారు. 14 ఏళ్లు నిండిన వారు పదవ తరగతిలో చేరి సెలవుల్లో శిక్షణ పొంది పరీక్షలు రాయవచ్చు అని పేర్కొన్నారు. అలాగే పదవ తరగతి పాస్ అయినవారు కళాశాలలో చేరకుండా నేరుగా ఓపెన్ స్కూల్ ద్వారా ఇంటర్ పరీక్షలు రాయవచ్చని సూచించారు.