కేబుల్ వైర్లు కట్.. నిలిచిన ప్రసారాలు

కేబుల్ వైర్లు కట్.. నిలిచిన ప్రసారాలు

మేడ్చల్: రామంతపూర్ విద్యుత్ ఘటనతో విద్యుత్ శాఖ చేపట్టిన చర్యలతో మేడ్చల్ పట్టణంలోని అనేక ప్రాంతాలలో కేబుల్ వైర్ల కటింగ్ జరిగింది. దీంతో పలు కాలనీలలో ప్రచార సాధనాలు ఆగిపోయాయి. పలుచోట్ల ఇంటర్నెట్ సేవలు సైతం నిలిచిపోయినట్లు మేడ్చల్ స్థానికులు తెలియజేశారు. అత్యవసరం ఉన్నవారికి ఇబ్బంది కలుగుతుందని, ముందుగా సమాచారాన్ని అందించాలని వారు అధికారులను కోరారు.