VIDEO: రేపు భైంసా వ్యవసాయ మార్కెట్ బంద్
NRML: భైంసా వ్యవసాయ మార్కెట్‌లో రేపు క్రయవిక్రయాలు జరగవని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి పురియా నాయక్ తెలిపారు. మంగళవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వ సెలవు దినం కావడంతో తాత్కాలికంగా భూసార్ బీట్ బంద్ ఉంటుందన్నారు. తిరిగి బుధవారం యధావిధిగా కార్యకలాపాలు కొనసాగుతాయన్నారు. ఈ విషయాన్ని రైతులు, కమిషన్ దారులు, ఖరీదు దారులు గమనించి సహకరించాలని కోరారు.