VIDEO: భారీ వర్షానికి కూలిన ప్రహరీ గోడ.. తప్పిన ప్రమాదం

VIDEO: భారీ వర్షానికి కూలిన ప్రహరీ గోడ.. తప్పిన ప్రమాదం

KMR: కర్షక్ బీఈడీ కళాశాల వెనుక ఉన్న ప్రహరీ భారీ వర్షాలకు కూలిపోయింది. గత వారం రోజులుగా కురుస్తున్న వానలకు శనివారం ఉదయం ఒక్కసారిగా గోడ కూలిపోగా ఎవరికి గాయాలు కాలేదు. కొత్త బస్టాండ్ నుంచి మెడికల్ కాలేజీకి వెళ్లే ప్రధాన రహదారిపై గోడ కూలడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే జేసీబీతో శిథిలాలను తొలగిస్తున్నారు.