సీఎం రేవంత్ రెడ్డి మహిళల పక్షపాతి: ఎమ్మెల్యే

సీఎం రేవంత్ రెడ్డి మహిళల పక్షపాతి: ఎమ్మెల్యే

RR: మహిళలకు స్వయం ఉపాధి కల్పనే ధ్యేయమని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. మియాపూర్‌లోని క్యాంపు కార్యాలయంలో 200 మంది మైనారిటీ మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని, సీఎం రేవంత్ రెడ్డి మహిళల పక్షపాతి అని పేర్కొన్నారు.