VIDEO: పాములకు పగ లేదు.. అవన్ని అపోహలు
HNK: హన్మకొండ నగరంలో ఎనిమల్ కేర్ సొసైటీ అధ్యక్షుడు పుట్టా జయకర్ జన సంచారంలో వచ్చే పాములకు మనుషుల పగ అనేది ఉండదని అన్నారు. పాములపై ఉన్న అపోహను తొలగించడానికి ఆయన చుట్టూ సర్పాలను ఆడిస్తూ వినూత్నంగా పాఠాలు బోధిస్తున్నారు. వాస్తవంగా పాములు మనుషులను చూడగానే భయపడి దూరంగా వెళ్తాయని, మనుషులు వాటిని వెంటాడి చంపేస్తున్నారని ఆయన తెలిపారు.