రేపు జిల్లాకు పవన్ కళ్యాణ్

సత్యసాయి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు గోరంట్ల మండలానికి రానున్నారు. పాకిస్థాన్ దాడుల్లో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని కల్లితండాలో పరామర్శించనున్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారైంది. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇవ్వనున్నారు.