మహా కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించిన ఎమ్మెల్యే

NZB: మహా కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించడం ద్వారా మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. ఈ మేరకు మౌని అమావాస్య పురస్కరించుకొని కుటుంబ సమేతంగా ప్రయాగ్ రాజ్‌లో పుణ్యస్నానాలు ఆచరించారు. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహా కుంభమేళాలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.