కాజీపేటలో సీపీఎం పార్టీ కార్యకర్తల ఆందోళన
HNK: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పై చెప్పు విసిరిన ఘటనలో బాధ్యుడైన న్యాయవాదిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సీపీఎం పార్టీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. హనుమకొండ జిల్లా కాజీపేట మున్సిపల్ సర్కిల్ కార్యాలయంలో సీపీఎం పార్టీ కార్యకర్తలు బుధవారం నిరసన తెలిపారు అనంతరం డిప్యూటీ కమిషనర్ రవీందర్‌కు వినతిపత్రం సమర్పించారు.