అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన: ఎమ్మెల్యే

నల్గొండ: గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యేయమని ఎమ్మెల్యే వీరేశం అన్నారు. ఆదివారం కొత్తగూడెం గ్రామంలో రూ.10 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు, బోగారం గ్రామంలో రూ.10 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. గ్రామాల్లో అన్ని మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.