నేడు బ్రహ్మంగారి తిరునాళ్ల వేడుకలు

పల్నాడు: వినుకొండ మండలం దొండపాడులో బుధవారం తిరునాళ్ల వేడుకలు జరగనున్నట్లు గ్రామస్తులు తెలిపారు. దొండపాడులో కొలువైన శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి తిరునాళ్ల సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు, అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.