లోక్ అదాలత్‌లో 570 కేసులు పరిష్కారం

లోక్ అదాలత్‌లో 570 కేసులు పరిష్కారం

PPM: జాతీయ లోకదాలత్ సందర్భంగా సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు శనివారం పాలకొండ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో 570 సివిల్, క్రిమినల్ కేసులు రాజీద్వారా పరిష్కరింపబడ్డాయని సివిల్ జడ్జ్ శ్రీమతి హరిప్రియ తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పాలకొండ న్యాయవాదులకు, పోలీస్ శాఖకు, కక్షి దారులకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు.