జడ్పీ హైస్కూల్లో రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం

జడ్పీ హైస్కూల్లో రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం

AKP: నర్సీపట్నం బలిఘట్టం జడ్పీ హైస్కూల్లో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బుధవారం విద్యార్థులచే రాజ్యాంగ పీఠికను చదివి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా భారతదేశ రాజ్యాంగం రచించిన అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని ఆర్ పద్మావతిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.