అప్పుడు వర్షాలు లేక.. నేడు తడారక!

NLG: జిల్లాలో గత వారం రోజులుగా ప్రతిరోజూ వర్షం కురుస్తుండటంతో పత్తి, కంది చేన్లలో నేల తడారక జాలువారుతున్నాయి. అప్పుడు వర్షాలు లేక చేలు ఎదగలేదని, ఇప్పుడు రోజూ కురుస్తున్న వర్షాలతో పత్తి చేలల్లో పూత, పిందె రాలుతుందని రైతులు తెలిపారు. చేను ఎత్తు పెరగకపోవడంతో భారీ వర్షాలకు పత్తి మొక్కలు నేలవాలుతున్నాయని తెలిపారు.