బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా అరుణ
JGL: మెట్‌పల్లికి చెందిన బీజేపీ సీనియర్ నాయకురాలు పూదరి అరుణ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా నియమితులయ్యారు. గతంలో మెట్‌పల్లి జడ్పీటీసీగా పనిచేసిన ఆమెను రాష్ట్ర నాయకత్వం ఈ పదవికి ఎంపిక చేసింది. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన నాయకులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానన్నారు.