గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందజేత

గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందజేత

ELR: బుట్టాయగూడెం(m) దొరమామిడి గ్రామంలో రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం శుక్రవారం అందచేశారు. ప్రెసిడెంట్ పెనుమర్తి సురేష్ బాబు మాట్లాడుతూ.. సమాజానికి ఉత్తమ పౌరులను అందించగల శక్తి కేవలం స్త్రీ మాత్రమే ఉందని అన్నారు. గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందించగలిగితే పుట్టే పిల్లల్లో వ్యాధినిరోధక శక్తి, తెలివితేటలు వస్తాయన్నారు.