రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
BDK: కొత్తగూడెం- పాల్వంచ పరిధిలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రశాంత్ అనే వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ప్రశాంత్ ప్రయాణిస్తున్న బైక్‌ను లారీ బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. మృతుడు ముకుందాపురం క్యాంప్ వేములవాడకు చెందిన యువకుడు కొండ ప్రశాంత్‌గా గుర్తించారు.