'శాంతి భద్రతల పరిరక్షణలో హోంగార్డ్ వ్యవస్థ కీలక పాత్ర'
BHPL: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో 63వ హోంగార్డ్ రేజింగ్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సంకీర్త్ పాల్గొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా శాంతి భద్రతల పరిరక్షణలో హోంగార్డ్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అనంతరం ఆయన హోం గార్డులకు ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారులు పాల్గొన్నారు.