అమరావతికి చట్టబద్ధత కల్పించడం చారిత్రాత్మకం: MLA

అమరావతికి చట్టబద్ధత కల్పించడం చారిత్రాత్మకం: MLA

అన్నమయ్య: అమరావతిని రాష్ట్ర రాజధానిగా చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్ ఆమోదం పొందిన సందర్భంగా పీలేరు MLA నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గురువారం హర్షం వ్యక్తం చేశారు. నగిరిపల్లిలోని MLA కార్యాలయంలో పార్టీ శ్రేణులు ప్రజలతో కలిసి దీపాలు వెలిగించి సంబరాలు నిర్వహించారు. పదేళ్ల నిరీక్షణకు ముగింపు పలుకుతూ అమరావతి రాజధానికి చట్టబద్ధత రావడం చారిత్రాత్మకమని MLA తెలిపారు.