ధర్మవరంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం
SS: ధర్మవరం పట్టణం 21వ వార్డులో టీడీపీ నాయకులు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 21వ వార్డు టీడీపీ ఇంఛార్జ్ బీరే శ్రీనివాసులు, 22వ వార్డు యూనిట్ ఇంఛార్జ్ సిద్దయ్యగుట్ట హరి, స్టోర్ డీలర్ బాలు, చంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ పంపిణీ కార్యక్రమం ద్వారా స్థానిక ప్రజలకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.