పశువులకు ఉచిత గాలికుంటు నివారణ టీకాలు
SRD: కంగ్టి మండలం సర్దార్ తండాలో శుక్రవారం పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు ఉచిత గాలికుంటు నివారణ టీకాలను ఇచ్చారు. 160 ఆవులకు, 335 గేదెలకు టీకాలు వేసినట్లు LSA బస్వయ్య స్వామి తెలిపారు. ఈ మేరకు భారత్ పశుధన్ యాప్ ద్వారా టీకాల కార్యక్రమంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ స్వరూప్ చంద్, గోపాలమిత్రలు మొయినొద్దీన్, మోహన్ ఉన్నారు.