‘పాస్‌పోర్ట్ కష్టాలకు చెక్.. 10 ఏళ్లలో భారీ మార్పు’

‘పాస్‌పోర్ట్ కష్టాలకు చెక్.. 10 ఏళ్లలో భారీ మార్పు’

పాస్‌పోర్ట్ సేవలపై విదేశాంగ మంత్రి జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్ల క్రితం దేశంలో పాస్‌పోర్ట్ కోసం అప్లై చేయాలంటే కేవలం 77 కేంద్రాలే ఉండేవని గుర్తుచేశారు. కానీ గత పదేళ్లలో కొత్తగా ఏకంగా 468 కేంద్రాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. దీంతో పాస్‌పోర్ట్ సేవలు సామాన్యులకు మరింత చేరువయ్యాయని, ఇప్పుడు అప్లై చేయడం చాలా సులభం అయ్యిందని వెల్లడించారు.