'గ్రామాల్లో త్రాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి '

SRPT: ఎండ తీవ్రత పెరగడంతో మునగాల మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా, పంచాయతీ కార్యదర్శులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎండ తీవ్రత పెరగడంతో గ్రామాల్లో ప్రజలకు త్రాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని, డ్రైనేజీ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.