సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NTR: నందిగామ కాకాని నగర్‌లో సీఎం సహాయ నిధి(CMRF) నుంచి మంజూరైన రూ.35,30,737 చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎంతో మంది నిరాశ్రయుల జీవితాల్లో కూటమి ప్రభుత్వం వెలుగులు నింపుతున్నామని ఎమ్మెల్యే అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారందరికీ ఈ చెక్కులు ఒక భరోసా అని పేర్కొన్నారు.