VIDEO: దిత్వా తుఫాన్ ప్రభావం.. కోనసీమలో వర్షం

VIDEO: దిత్వా తుఫాన్ ప్రభావం.. కోనసీమలో వర్షం

కోనసీమ: దిత్వా తుఫాన్ ప్రభావంతో జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. అమలాపురం, పీ.గన్నవరం, రాజోలు, కొత్తపేట, ముమ్మిడివరం నియోజకవర్గాలలో చిరు జల్లులు మొదలయ్యాయి. ఉప్పలగుప్తం మండలం చల్లపల్లిలో పొలానికి వెళ్లిన రైతులు వర్షానికి ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాలలో వర్షంతో పాటు గాలులు కూడా వీస్తున్నాయి. అయితే, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.